tsrtc: జగన్ ను చూసి కేసీఆర్ బుద్ధితెచ్చుకోవాలి: ఎంపీ కోమటిరెడ్డి

  • ఆర్టీసీపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయనడం తగదు
  • కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు
  • కేసీఆర్ ఏది మాట్లాడినా మోసమే 

ఆర్టీసీపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయనడం సరికాదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హితవు పలికారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని, ఈ విషయంలో జగన్ ను చూసి కేసీఆర్ బుద్ధితెచ్చుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఏది మాట్లాడినా మోసమే అని, వరంగల్ లో ఆర్టీసీ ఆస్తులను ఓ ఎంపీకి ధారాదత్తం చేశారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను పడిందని, ఆర్టీసీ సమ్మెపై టీఎన్జీవో నేతల వ్యాఖ్యలు సరికాదని, కార్మికులు అధైర్యపడొద్దని, తెలంగాణ సమాజం వారి వెంట ఉందని ధైర్యం చెప్పారు.

కార్మికుల ఆందోళనపై హరీశ్ రావు స్పందించరే?: జీవన్ రెడ్డి

టీఎస్సార్టీసీ కార్మికుల ఆందోళనపై మంత్రి హరీశ్ రావు ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ నేత జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీకి గతంలో గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీశ్ స్పందిస్తే వచ్చే నష్టమేంటి? అని అన్నారు. హరీశ్ రావు న్యాయనిర్ణేతగా ఉండి కార్మికుల తరపున పోరాడాలి అని డిమాండ్ చేశారు. కార్మికులు ఇచ్చే గౌరవమే జీవితకాలం ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

More Telugu News