YSRCP: శకుని మామా! మిగతా రూ.2,260 కోట్లు J- టాక్స్ కింద జమాయించినట్లే కదా?: బుద్ధా వెంకన్న

  • 50 లక్షల మంది రైతులకు రూ.6,250 కోట్లు ఇవ్వాలి
  • కానీ విడుదల చేసింది 5,510 కోట్లు
  • అంటే రైతు భరోసా అందేది కొందరికేనా!

ఏపీలో రేపటి నుంచి రైతు భరోసా పథకం ప్రారంభం కానుందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఓ ట్వీట్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ‘శకుని మామా, ప్రతి రైతుకు 12,500 ఇస్తానన్నాడు మీ తుగ్లక్ వైఎస్ జగన్.. అంటే 50 లక్షల మందికి ఇవ్వాల్సింది 6,250 కోట్లు. కానీ విడుదల చేసింది 5,510 కోట్లు. అంటే రైతు భరోసా అందేది కొందరికే అన్నమాట!’ అని విమర్శించారు. రైతుకి ఇచ్చేది రూ.6,500 అయితే కావాల్సింది రూ 3,250 కోట్లేగా, మరి, మిగతా రూ.2,260 కోట్లు ఎవరికి ఇస్తున్నారు? J టాక్స్ కింద జమాయించినట్లే కదా’ అంటూ ట్వీట్ చేశారు బుద్ధా వెంకన్న.

More Telugu News