షాహిద్ కపూర్ హీరోగా హిందీలోకి 'జెర్సీ'
- తెలుగులో హిట్ కొట్టేసిన 'జెర్సీ'
- హిందీ రీమేక్ కి సన్నాహాలు
- వచ్చే ఏడాది ఆగస్టు 28న విడుదల
తెలుగులో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాను, హిందీలోకి రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్ రంగంలోకి దిగాడు. అల్లు అరవింద్ - దిల్ రాజు ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు. తెలుగులో 'జెర్సీ' సినిమాను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరియే హిందీ రీమేక్ కి కూడా దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టు 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'తో హిట్ కొట్టేసిన షాహిద్, 'జెర్సీ' రీమేక్ తోను మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.