Valmiki: వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

  • నేడు వాల్మీకి జయంతి
  • ట్వీట్ చేసిన సీఎం జగన్
  • వాల్మీకి గొప్ప కావ్యాన్ని రచించారంటూ కితాబు
రామాయణ మహాకావ్యాన్ని మానవాళికి అందించిన మహనీయుడు వాల్మీకి జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఉన్నతమైన ఆదర్శాలను, మానవతా విలువలను రామాయణం అడుగడుగునా మనకు బోధిస్తుందని తెలిపారు. రామకావ్యం వెలుగుల్లో మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని జగన్ వ్యాఖ్యానించారు. వాల్మీకి గొప్ప కావ్యాన్ని రచించారంటూ కొనియాడారు.
Valmiki
Jagan
Andhra Pradesh
YSRCP

More Telugu News