Narendra Modi: చెత్త ఏరుతున్నప్పుడు తన చేతిలో ఉన్న పరికరం ఏంటో చెప్పిన ప్రధాని మోదీ

  • మోదీ చేతిలో టార్చ్ లైట్ వంటి పరికరం
  • జనాల్లో పెరిగిన ఆసక్తి
  • ట్విట్టర్ లో వివరణ ఇచ్చిన మోదీ
చైనా అధినేత షీ జిన్ పింగ్ తో చర్చల కోసం మహాబలిపురం వెళ్లిన ప్రధాని మోదీ ఉదయం వ్యాహ్యాళి సందర్భంగా బీచ్ లో చెత్త ఏరడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో మోదీ చేతిలో ఉన్న టార్చ్ లైట్ వంటి పరికరం కూడా అందరిలో ఆసక్తి కలిగించింది. అదేంటన్నది చాలామందికి తెలియలేదు. కొందరు టార్చ్ లైట్ అని, మరికొందరు లైట్ వెయిట్ డంబెల్ అని ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యానించారు. సామాన్య ప్రజలే కాదు, మోదీ సన్నిహితుల్లోనూ ఇదే సందేహం కలిగింది. దీనిపై స్వయంగా మోదీనే వివరణ ఇచ్చారు.

తన చేతిలో ఉన్నది ఆక్యుప్రెషర్ రోలర్ అని వెల్లడించారు. ఇది చేతిలో ఉంచుకోవడం వల్ల దేహంలో రక్తప్రసరణ క్రమబద్ధంగా కొనసాగుతుందని, తద్వారా ఒత్తిళ్లు తగ్గుతాయని తెలిపారు. విపరీతమైన ఉద్విగ్నత, నిద్రలేమి సమస్యలు, తలనొప్పి, జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని వివరించారు. తాను ఆక్యుప్రెషర్ రోలర్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటానని, అది తనకెంతో ఉపయుక్తంగా ఉంటోందని ట్వీట్ చేశారు.
Narendra Modi
Occupressure

More Telugu News