Haryana: ఎన్నికలకు ముందు హర్యానా పీసీసీ చీఫ్ షెల్జా సంచలన నిర్ణయం

  • 16 మంది రెబల్స్‌పై ఆరేళ్ల వేటు
  • పార్టీ రాజ్యాంగ నియమావళికి విరుద్ధంగా ప్రకటించారన్న షెల్జా
  • వేటుపడిన వారిలో కీలక నేతలు

హర్యానా కాంగ్రెస్ చీఫ్ కుమారి షెల్జా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ప్రకటించిన అభ్యర్థులపై పోటీకి దిగిన 16 మంది రెబల్స్‌ను బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి వారిని ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్టు ఆమె తెలిపారు. రెబల్స్ చర్య పార్టీ రాజ్యాంగ నియమావళికి పూర్తిగా విరుద్ధమని పేర్కొన్న షెల్జా.. ఆ 16 మందినీ ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. వేటు పడిన వారిలో రంజిత్ సింగ్, మాజీ మంత్రి నిర్మల్ సింగ్, మాజీ డిప్యూటీ స్పీకర్ ఆజాద్ మహ్మద్, రామ్ శర్మ తదితర కీలక నేతలు ఉన్నారు.

More Telugu News