Petrol: నేడు స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు!

  • తగ్గిన క్రూడాయిల్ ధరలు
  • లీటర్ పెట్రోల్ పై 10 పైసల తగ్గింపు
  • 15 పైసలు తగ్గిన డీజిల్ ధర
అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గుతూనే ఉండటంతో ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. శనివారం నాడు లీటర్ పెట్రోల్ పై 10 పైసలు, డీజిల్ పై 15 పైసల మేరకు ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి.

ఈ తగ్గుదల తరువాత హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 77.99కు చేరగా, డీజిల్ ధర రూ. 72.47కు తగ్గింది. అమరావతిలో పెట్రోల్ ధర రూ. 77.58కి, డీజిల్ ధర రూ. 71.75కు చేరింది. విజయవాడలోనూ ధరలు దాదాపు ఇదే విధంగా ఉన్నాయి.

ఇక దేశ రాజధాని న్యూఢిల్లీ విషయానికి వస్తే, నిన్నటితో పోలిస్తే 10 పైసల మేరకు తగ్గిన లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 73.32కు, 14 పైసలు తగ్గిన డీజిల్ ధర రూ. 66.46కు చేరుకున్నాయి. 
Petrol
Diesel
Price Slash
OMCs

More Telugu News