Narasaraopeta: నరసరావుపేటలో భారీ చోరీ
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో భారీ దొంగతనం జరిగింది. నరసరావుపేటలోని వైభవ్ జ్యుయెలరీ షాపు యజమాని ఇంట్లో దొంగలు చొరబడి విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు దాదాపు రూ.40 లక్షల విలువైన ఆభరణాలతో ఉడాయించారు. ఈ ఘటనపై ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.