Narendra Modi: తమిళ సంప్రదాయ లుంగీకట్టులో వచ్చి జిన్ పింగ్ కు స్వాగతం పలికిన మోదీ

  • భారత్ వచ్చిన చైనా అధ్యక్షుడు
  • మహాబలిపురంలో మోదీతో చర్చలు
  • తమిళ ఆహార్యంతో సరికొత్తగా మోదీ
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాని నరేంద్ర మోదీ మహాబలిపురంలో చర్చలు జరుపున్నారు. జిన్ పింగ్ ఈ మధ్యాహ్నం చెన్నై చేరుకున్నారు. అక్కడి నుంచి మహాబలిపురం వెళ్లారు. ఈ సందర్భంగా మహాబలిపురంలో ఆయనకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు.

తమిళ సంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో మోదీ లుంగీకట్టుతో కనిపించడం విశేషం. అచ్చం ఓ తమిళుడిని తలపించే ఆహార్యంతో ఆయన జిన్ పింగ్ కు స్వాగతం పలికారు. మహాబలిపురంలోని అనేక చారిత్రక ప్రదేశాలతో పాటు యునెస్కో వారసత్వ కట్టడాలను కూడా జిన్ పింగ్ కు దగ్గరుండి చూపించారు.
Narendra Modi
Xi Jinping
Mahabalipuram
Tamilnadu

More Telugu News