ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ... డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డ టీమిండియా కెప్టెన్
- దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోసిన కోహ్లీ
- టెస్ట్ కెరీర్ లో ఏడవ డబుల్ సెంచరీ నమోదు
- భారత్ స్కోరు: 483/4
మరో ఎండ్ లో కోహ్లీకి అండగా రవీంద్ర జడేజా 29 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 483 పరుగులు. అంతకు ముందు 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహానే ఔట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా మూడు వికెట్లు తీయగా, మహరాజ్ ఒక్క వికెట్ తీశాడు.