rafel: సంప్రదాయాలపై నాకు విశ్వాసం ఉంది...అందుకే పూజలు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ వివరణ

  • రాఫెల్ యుద్ధ విమానాల స్వీకరణ సందర్భంగా మంత్రి పూజలు
  • విమర్శలు ఎక్కుపెట్టిన విపక్షాలు
  • వివరణ ఇచ్చిన కేంద్ర మంత్రి

ప్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానం మొట్ట మొదటిది అందుకున్న సమయంలో ఆయుధ పూజ నిర్వహించడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వివరణ ఇచ్చారు. బాల్యం నుంచి తనకు ఆచార, సంప్రదాయాలపై నమ్మకం ఉందని, ఆ నమ్మకంలో భాగంగానే కొత్త వస్తువు స్వీకరించి వినియోగిస్తున్న సందర్భంగా పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

రాఫెల్ విమానాన్ని స్వీకరించిన సందర్భంగా మంత్రి పూజలు జరిపి చక్రాల కింద నిమ్మకాయలు ఉంచడం, పసుపు కుంకుమతో ఓం అని రాయడంపై విపక్షాలు విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై మంత్రి స్పందించారు.

మత విశ్వాసం ప్రకారం పూజలు చేసుకునే హక్కు భారతీయులకు ఉందని, అందువల్ల తాను చేసింది తప్పుకాదన్నారు. భవిష్యత్తులోనూ ఇలాగే చేస్తానన్నారు. వాస్తవానికి ఈ అంశంపై విమర్శల్లో కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని ఎద్దేవా చేశారు.

కాగా రాజ్‌నాథ్‌ పూజలకు పాకిస్థాన్‌ మద్దతు తెలపడం విశేషం. ఆ దేశ సైనిక విభాగం అధికార ప్రతినిధి ఆసిఫ్‌ గఫూర్‌ స్పందిస్తూ మత విశ్వాసాల ప్రకారం పూజలు తప్పుకాదన్నారు. అయితే కేవలం ఆయుధాలతో మాత్రమే గెలవలేమని, వాటిని నిర్వహించే వ్యక్తుల సామర్థ్యంపై విజయం ఆధారపడి ఉంటుందని అన్నారు.

More Telugu News