Tamil Nadu: కోలీవుడ్ దర్శకుల సంఘానికి నటుడు సూర్య భారీ విరాళం

  • సంఘం సంక్షేమం కోసం రూ. 10 లక్షల విరాళం
  • ప్రధాన కార్యదర్శి ఉదయ్‌కు చెక్కు అందజేత
  • అభినందించిన సంఘం అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి

కోలీవుడ్ సినీ దర్శకుల సంఘానికి ప్రముఖ సినీ నటుడు సూర్య 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశాడు. దర్శకుల సంఘం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సూర్య ఈ విరాళాన్ని అందించాడు. దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌వీ ఉదయ్ కుమార్‌కు సూర్య ఈ మేరకు రూ.10 లక్షల చెక్‌ను అందించాడు. సంఘానికి భారీ విరాళం అందించిన సూర్యకు సంఘం అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి, కోశాధికారి పేరరసు కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News