Supreme Court: వాహన నేరాలు కూడా ఐపీసీ పరిధిలోకే వస్తాయి: సుప్రీంకోర్టు స్పష్టీకరణ

  • 2008 నాటి గౌహతి కోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీం
  • బాధ్యత లేకుండా వాహనం నడిపితే నేరస్తులే
  • ఐపీసీ కింద కఠినంగా ఉండాల్సిందేనన్న న్యాయమూర్తులు

మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను అతిక్రమించే వారు ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్)ను అతిక్రమించినట్టేనని సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. 2008 డిసెంబర్ లో ఓ కేసును విచారించిన గౌహతి హైకోర్టు, మోటారు వాహనాల చట్టానికి చెందిన కేసులను ఐపీసీ కింద పరిగణించలేమని తీర్పివ్వగా, సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది. వాహనాలను వేగంగా నడిపించడం, బాధ్యత లేకుండా డ్రైవింగ్ చేయడం వంటి నేరాలు చేసేవారిపై కఠినంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

మోటారు వాహనాల చట్టంలో ఐపీసీని ప్రవేశపెట్టరాదని అసోం, నాగాలాండ్, మేఘాలయ తదితర ఈశాన్య రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించగా, సదరు పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. 

More Telugu News