Ajinkya Rahane: తండ్రయిన టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే

  • శనివారం ఆడ శిశువుకు జన్మనిచ్చిన రహానే అర్ధాంగి
  • ఆ సమయంలో మ్యాచ్ ఆడుతున్న రహానే
  • బిడ్డను చేతుల్లో పొదివి పట్టుకుని హర్షం

టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే తండ్రయ్యాడు. రహానే అర్ధాంగి రాధిక శనివారం నాడు పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ సమయంలో రహానే విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం పట్ల రహానే, రాధిక ఆనందంతో పొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో, తన కుమార్తెను చేతుల్లోకి తీసుకుని మురిసిపోతున్న ఫొటోను రహానే సోషల్ మీడియాలో పంచుకున్నాడు. "హలో" అంటూ బిడ్డను పలకరిస్తూ రహానే, రాధిక సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్న ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తోంది. రహానే వివాహం తన పక్కింటమ్మాయి రాధిక దోపావ్ కర్ తో 2014లో జరిగింది.

More Telugu News