TV9: రవిప్రకాశ్ ను పరామర్శించేందుకు చంచల్ గూడ జైలుకు వెళ్లిన రేవంత్ రెడ్డి

  • చంచల్ గూడ జైల్లో ఉన్న రవిప్రకాశ్
  • నిధుల దుర్వినియోగం కేసులో రెండు వారాల రిమాండ్
  • రవిప్రకాశ్ కు సంఘీభావం తెలుపుతున్న పలువురు నేతలు

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హైదరాబాదులోని చంచల్ గూడ జైలుకు వెళ్లారు. జైల్లో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను పరామర్శించి, సంఘీభావం తెలిపారు. టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో రవిప్రకాశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిధులను అక్రమంగా దారి మళ్లించారంటూ ఆ ఛానల్ ప్రస్తుత యాజమాన్యం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా... న్యాయమూర్తి రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీని విధించారు. దీంతో, ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు రవిప్రకాశ్ కు సంఘీభావం తెలుపుతున్నారు.

More Telugu News