వాట్స్ యాప్ లో అమ్మాయిల చిత్రాలు... స్పా మాటున సెక్స్ రాకెట్ గుట్టు రట్టు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాట్స్ యాప్ లో అమ్మాయిల చిత్రాలు... స్పా మాటున సెక్స్ రాకెట్ గుట్టు రట్టు!

  • యూపీలోని ఘజియాబాద్ లో ఘటన
  • సమాచారం తెలుసుకుని పోలీసుల దాడులు
  • 9 మంది అమ్మాయిలు సహా 19 మంది అరెస్ట్
సోషల్ మీడియా దిగ్గజం వాట్స్ యాప్ లో అమ్మాయిల ఫోటోలు పంపి, వారిని ఆకర్షించి, స్పా ముసుగులో వ్యభిచారం సాగిస్తున్న వారి బాగోతాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బయటపెట్టారు. వివరాల్లోకి వెళితే, ఘజియాబాద్ నగర పరిధిలోని రాజ్ హంస ప్లాజాలోని మూడు స్పా సెంటర్లలో సెక్స్ రాకెట్ కొనసాగుతోందన్న సమాచారం అందడంతో, పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో 9 మంది యువతులు సహా, మొత్తం 19 మందిని అరెస్టు చేశారు.

 నగరంలోని విటులకు యువతుల ఫోటోలను పంపించి, వారిని స్పాలకు ఆహ్వానించి ఈ రాకెట్ నడుపుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యభిచార దందాను నిర్వహిస్తున్నది ఓ మహిళని గుర్తించినట్టు అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్ కేశవ్ కుమార్ వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న యువతుల నుంచి రూ. 16 వేలను, 24 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్పా సెంటర్లు నిర్వహిస్తున్న వారిలో కొందరు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
S*x Rocket
Uttar Pradesh
Ghagiyabad
Police
Case

More Telugu News