Rajnath Singh: ఈసారి ఫ్రాన్స్ గడ్డపై ఆయుధ పూజ నిర్వహించనున్న భారత్

  • ప్రతి దసరాకు రాజ్ నాథ్ సింగ్ ఆయుధ పూజ
  • ఈ సాయంత్రం ఫ్రాన్స్ వెళుతున్న రాజ్ నాథ్
  • దసరా నాడు భారత్ కు అందనున్న తొలి రాఫెల్
భారత అమ్ములపొదిలో తిరుగులేని అస్త్రంగా భావిస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల్లో మొదటిది ఈ నెల 8న అప్పగించనున్నారు. భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సాయంత్రం ఫ్రాన్స్ బయల్దేరనున్నారు. ఎల్లుండి ఫ్రాన్స్ లో జరిగే ఓ కార్యక్రమంలో తొలి రాఫెల్ విమానం అందుకోనున్నారు.ఈ సందర్భంగా ఆయన ఫ్రెంచ్ గడ్డపైనే ఆయుధ పూజ నిర్వహించనున్నారు. గతంలో హోం మంత్రిగా ఉన్న సమయంలోనూ రాజ్ నాథ్ ప్రతి దసరాకు ఆయుధ పూజ నిర్వహించారు. ఈసారి విజయదశమికి ఫ్రాన్స్ లో ఉంటున్నందున అక్కడే పూజలు నిర్వహిస్తారు.
Rajnath Singh
France
Rafale
India

More Telugu News