Artist: అలాంటి టీవీ షోలు ‘వెరీ అగ్లీ’గా ఉంటాయి: నటి మంచు లక్ష్మి

  • మగవాళ్లు ఆడవాళ్ల వేషాలు ధరించి నటిస్తుంటారు
  • నోటికొచ్చినట్టుగా ఆడవాళ్ల గురించి మాట్లాడుతుంటారు
  • ఇలాంటి టీవీ షోలు చాలా అసహ్యకరంగా ఉంటాయి
కొన్ని టీవీ షోలలో మగవాళ్లు ఆడవాళ్ల వేషాలు ధరించి నటిస్తుంటారని, ఇలాంటి షోలు ‘వెరీ అగ్లీ’గా అనిపిస్తాయని ప్రముఖ నటి మంచు లక్ష్మి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘టీవీ9’ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, మగవాళ్లకు ఆడవాళ్ల వేషాలు వేసి, నోటికొచ్చినట్టుగా ఆడవాళ్ల గురించి మాట్లాడటంలో ఎటువంటి హాస్యం లేదని అన్నారు. ఇలాంటి టీవీ షోలు చాలా అసహ్యకరంగా ఉంటాయని, వీటి అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
Artist
Manchu Lakshmi
Tv9

More Telugu News