Telangana: సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటారా?: టీ-సర్కార్ పై పొన్నాల ఫైర్

  • సీఎం కేసీఆర్ పై పొన్నాల ధ్వజం
  • ఆర్టీసీ కార్మికులతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు తగదు
  • న్యాయమైన కార్మికుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్నారు
న్యాయమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్న టీఎస్సార్టీసీ కార్మికులపై టీ-సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, న్యాయమైన వారి హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తీసేస్తామనడం నియంతృత్వ పోకడకు నిదర్శనమని, ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా సమ్మె చేస్తున్నవారిని బెదిరిస్తోందని విమర్శించారు. ప్రజలందరూ ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు.
Telangana
tsrtc
t-congress
Ponnala Lakshmaiah

More Telugu News