Jagan: మూలా నక్షత్రం రోజున అమ్మవారికి వస్త్రాలు సమర్పించాలి.. జగన్ చేసింది తప్పు:  దేవినేని ఉమ

  • ఒక రోజు ముందే అమ్మవారికి వస్త్రాలను సమర్పించారు
  • హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు
  • జగన్ కుల వివక్షకు పారిశ్రామికవేత్తలు కూడా పారిపోతున్నారు
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని... భక్తుల మనోభావాలతో ఆడుకునే హక్కు ఆయనకు ఎవరిచ్చారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి మూలా నక్షత్రం రోజున పట్టు వస్త్రాలను సమర్పించాల్సి ఉందని... కానీ, జగన్ మాత్రం సంప్రదాయాలన్నీ పక్కన పెట్టి ఒక్క రోజు ముందే వస్త్రాలను సమర్పించారని మండిపడ్డారు.

గతంలో చంద్రబాబు కార్యాలయంలో పని చేసిన అధికారులకు పోస్టింగులు ఇవ్వడం లేదని, రిలీవ్ చేయకుండా వివక్ష చూపుతున్నారని ఉమ విమర్శించారు. ఒక సామాజికవర్గానికే ప్రాధాన్యతను ఇస్తున్నారని... జగన్ కుల వివక్షను చూసి పారిశ్రామికవేత్తలు కూడా పారిపోతున్నారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అరాచకంతో ఓ మహిళా అధికారిణి రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని చెప్పారు.
Jagan
Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News