ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా జీతభత్యాలను ఖరారు చేసిన ప్రభుత్వం

05-10-2019 Sat 09:48
  • నెలకు రూ.3.82ల వేతనం ఖరారు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • మొత్తం జీతభత్యాల్లో వేతనం రూ. 2 లక్షలు
ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా జీతభత్యాలను ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఖరారు చేసింది. జీతభత్యాల కింద నెలకు రూ.3.82 లక్షలు కేటాయిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తంలో రూ.2 లక్షలను వేతనంగా పేర్కొనగా, వాహన సౌకర్యం కోసం రూ. 60 వేలు, ప్రభుత్వం కేటాయించిన అధికారిక క్వార్టర్స్‌లో నివసించకుంటే అద్దె చెల్లింపుల కోసం రూ. 50 వేలు, మొబైల్ ఫోన్ చార్జీలకు రూ. 2 వేలు, వ్యక్తిగత సిబ్బంది వేతనాలకు రూ. 70 వేలుగా నిర్ణయించింది.