Chandana Deepti: జగన్ ను తన వివాహానికి ఆహ్వానించిన మెదక్ ఎస్పీ చందన!

  • త్వరలో చందనా దీప్తి వివాహం
  • జగన్, భారతిలకు పెళ్లి శుభలేఖ
  • నేడో, రేపో కేసీఆర్ ను ఆహ్వానించనున్న చందన
మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి, తనకు కాబోయే భర్తతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన భార్య భారతిని కలిసి, తన వివాహానికి ఆహ్వానించారు. చందన కాబోయే భర్త జగన్ బంధువర్గానికి చెందిన వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాహానికి జగన్ కచ్చితంగా హాజరవుతారని సమాచారం. ఇదే సమయంలో మెదక్ జిల్లా ఎస్పీగా ఆమె విధుల్లో ఉండటంతో, ఈ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరవుతారని తెలుస్తోంది. నేడో, రేపో, ప్రగతి భవన్ కు వెళ్లి, కేసీఆర్ కు కూడా తన పెళ్లి శుభలేఖను చందన అందించనున్నారని తెలుస్తోంది. కాగా, జగన్ ను కలిసిన వారిలో చందన కాబోయే భర్తతో పాటు, ఆమె కుటుంబీకులు కూడా ఉన్నారు.
Chandana Deepti
Marriage
Jagan
KCR

More Telugu News