Kangana Ranout: తన తొలి ముద్దు అనుభవాన్ని వివరంగా చెప్పిన కంగన రనౌత్!

  • పంజాబీ అబ్బాయిని ఇష్టపడ్డ కంగన
  • 17 ఏళ్ల వయసులోనే తొలి ప్రేమ
  • ఫస్ట్ కిస్ సమయంలో బిగుసుకుపోయానన్న ముద్దుగుమ్మ 
తొలి ముద్దు ఎవరికైనా జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాన్ని ఇస్తుంది. కానీ, బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ మాత్రం, తానిచ్చిన ముద్దును తాను గుర్తుంచుకుంది కానీ, తన బాయ్ ఫ్రెండ్ మాత్రం నచ్చలేదని ముఖం మీదే చెప్పేశాడట. ఈ విషయాన్ని కంగనానే స్వయంగా మీడియాతో పంచుకుంది. ఇటీవల ఓ సదస్సు జరుగగా, దానిలో పాల్గొన్న కంగన, తన తొలి ప్రేమకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

తాను 17 ఏళ్ల వయసులో చండీగఢ్ లో ఉంటున్నప్పుడే ఓ పంజాబీ అబ్బాయిని ఇష్టపడి, కిస్ ఇచ్చానని చెప్పింది. తన ఫ్రెండ్ ఓ అబ్బాయితో డేటింగ్ కు వెళ్లగా, అతని ఫ్రెండ్ తో తాను ఉండాల్సి వచ్చిందని, అతను చాలా క్యూట్ గా ఉండేవాడని చెప్పింది. అతనికి తన ప్రేమను గురించి చెప్పగా, తనను చిన్న పిల్లగా చూశాడని, అప్పుడు తన గుండె పగిలినంత పనైందని వాపోయింది.

తనకు ఒక్క అవకాశం ఇస్తే, ఎదిగి చూపిస్తానని అతనికి మెసేజ్ లు పెట్టేదాన్నని, కొన్ని రోజుల డేటింగ్ తరువాత విడిపోయామని అంది. అప్పట్లో తనకు ముద్దు పెట్టడం కూడా తెలియదని, అరచేతిని ముద్దాడుతూ ప్రాక్టీస్ చేసేదాన్నని, తన తొలి ముద్దు సమయంలో బిగుసుకుపోయానని చెబుతూ, తన టీనేజ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది కంగన.
Kangana Ranout
First Kiss
Dating

More Telugu News