Pakistan: పాకిస్థాన్‌లో ప్రధాని, అధ్యక్ష పదవులకు ముస్లింలు మాత్రమే అర్హులు: ఇమ్రాన్ ప్రభుత్వం స్పష్టీకరణ

  • ముస్లిమేతరులు పదవులు అధిష్ఠించేలా రాజ్యంగ సవరణ బిల్లు
  • అడ్డుకున్న ఇమ్రాన్  ప్రభుత్వం
  • పాకిస్థాన్ ఇస్లామిక్ గణతంత్ర దేశమని స్పష్టీకరణ
పాకిస్థాన్‌లో అధ్యక్ష, ప్రధాని పదవులు కేవలం ముస్లింలకు మాత్రమేనని ఇమ్రాన్‌ఖాన్ సర్కార్ స్పష్టం చేసింది. ముస్లిమేతరులు వాటిని అధిష్ఠించడానికి అనర్హులని పేర్కొంది. ముస్లిమేతరులు కూడా ఈ పదవులను చేపట్టేందుకు వీలుగా పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన క్రిస్టియన్‌ ఎంపీ నవీద్‌ ఆమిర్‌ జీవా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడుతుండగా, ప్రభుత్వం దానిని అడ్డుకుంది.

ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అలీ మహ్మద్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఇస్లామిక్ గణతంత్ర దేశమని పేర్కొన్నారు. ఇక్కడ దేశాధ్యక్షుడు, ప్రధాని పదవులకు ముస్లింలు మాత్రమే అర్హులు అవుతారని ఆయన స్పష్టం చేశారు.  
Pakistan
Imran khan
president of pak
Prime Minister of pak

More Telugu News