Araku: పెళ్లికూతురు కానున్న వైసీపీ ఎంపీ... 17న శివప్రసాద్ తో మాధవి వివాహం!

  • తెల్లవారుజామున 3.15 గంటలకు వివాహం
  • విశాఖపట్నంలో రిసెప్షన్
  • హాజరుకానున్న సీఎం జగన్
అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17న జరుగనుంది. మాధవికి గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌ తో నిశ్చితార్థం జరిగిందని ఆమె సోదరులు మహేశ్, ప్రసాద్‌ వెల్లడించారు. 17వ తేదీ, గురువారం తెల్లవారుజామున 3.15 గంటలకు శరభన్నపాలెంలో వివాహం జరుగుతుందని, ఆపై విశాఖపట్నంలో రిసెప్షన్‌ ఉంటుందని వారు తెలిపారు. ఈ వివాహానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారని సమాచారం.
Araku
YSRCP
Goddeti Madhavi
Marriage
Jagan

More Telugu News