Tirupati: తిరుపతి జూలో రాయల్ బెంగాల్ టైగర్ కు ఐదు పిల్లలు... ఒకదానికి జగన్ పేరు పెట్టిన మంత్రి బాలినేని!

  • సమీర్, రాణిలకు ఐదు పిల్లలు
  • చిన్న మగకూనకు జగన్ పేరు
  • పులి పిల్లలను చూసేందుకు సందర్శకుల ఉత్సాహం
తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలలో, రాయల్ బెంగాల్ టైగర్ కు ఐదు కూనలు జన్మించగా, వాటి నామకరణం వైభవంగా జరిగింది. జూలో ఉన్న తెల్ల పులుల జంట సమీర్, రాణిలకు ఐదు పిల్లలు పుట్టగా, వాటికి ఏపీ అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్లు ఖరారు చేశారు. మూడు మగ కూనలు, రెండు ఆడ కూనలు జన్మించగా, మగ పిల్లలకు వాసు, సిద్ధాన్, జగన్ అని, ఆడ కూనలకు విజయ, దుర్గ అనే పేర్లను బాలినేని ఖరారు చేశారు.

కాగా, మగ కూనల్లో చిన్నదానికి తమ అధినేత పేరును పెట్టడం ద్వారా, ఆయనపై తనకున్న అభిమానాన్ని బాలినేని చాటుకున్నట్లయింది. ఇక, పెద్ద కూనకు పెట్టిన పేరుపైనా చర్చ జరుగుతోంది. బాలినేనిని ప్రకాశం జిల్లాలో అభిమానులంతా 'వాసు' అని పిలుస్తుంటారు. ఇప్పుడీ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ ఐదు కూనలనూ చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు.
Tirupati
Zoo
Jagan
Balineni
Names
Tigers

More Telugu News