తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు!

04-10-2019 Fri 20:01
  • అద్దె బస్సులు, ప్రైవేట్ బస్సులు తిప్పుతాం
  • అవసరమైతే పాఠశాలల బస్సులు కూడా నడుపుతాం
  • పండగ వేళ ప్రజలు ఇబ్బంది పడకూడదు: సోమేశ్ కుమార్

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె దృష్ట్యా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా మార్గాల్లో అద్దె బస్సులు, ప్రైవేట్ బస్సులు నడపనున్నారు. ఈ అర్ధరాత్రి నుంచి ఈ బస్సులు నడవనున్నాయి. సమ్మె నివారణకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నామని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. అవసరమైతే పాఠశాలల బస్సులు కూడా నడుపుతామని, అవసరమైన రక్షణ ఏర్పాట్లు చేసి ప్రైవేట్ బస్సులు నడుపుతామని, పండగ వేళ ప్రజలు ఇబ్బంది పడకూడదనేది తమ ఉద్దేశమని అన్నారు. ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయొద్దని ప్రైవేట్ వాహనాల యజమానులకు చెప్పామని అన్నారు.