YSRCP: పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి చులకన కావొద్దు: టీడీపీ నేత గోరంట్ల

  • వైసీపీ నాయకులు మాపై అనేక పోస్టులు పెట్టారు
  • వీటిపై ఎలాంటి చర్యలూ లేవు!
  • ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు

వైసీపీ నాయకులు తమపై అనేక పోస్టులు పెట్టారని, వీటిపై ఎలాంటి చర్యలూ లేవని, ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తే మాత్రం అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని టీడీఎల్పీ ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయమై పోలీసులు చర్యలు తీసుకోకపోతే మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ అచేతనంగా మారిపోయిందని, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి చులకన కావొద్దని సూచించారు.

టీడీపీకి చెందిన మరో నేత నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ, సీఎం కార్యాలయం ఆదేశాల మేరకే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వ్యవస్థలపై తమకు ఇంకా నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని పోలీసులు కాపాడాలని సూచించారు. అత్యుత్సాహం చూపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాతంగా ప్రతి కేసును విచారించి పోలీసులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

More Telugu News