ఏపీకి ఎంగిలి మెతుకులు విసిరినట్టు ఇచ్చారు: కన్నాపై తులసిరెడ్డి ఫైర్
- ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పెట్టలేదా?
- పదేళ్ల పాటు హోదా కావాలని వెంకయ్యనాయుడు అడిగింది కూడా నాటకమేనా?
- కశ్మీర్ పై చూపుతున్న శ్రద్ధలో కనీసం పదో వంతైనా ఏపీపై చూపాలి
కశ్మీర్మీ పై చూపుతున్న శ్రద్ధలో కనీసం పదో వంతైనా ఏపీపై చూపాలని తులసిరెడ్డి అన్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు రూ. 24,350 కోట్లు ఇవ్వాల్సి ఉంటే... ముష్టి వేసినట్టు రూ. 1,050 కోట్లు ఇవ్వడం నిజం కాదా? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు రూ. 5 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉంటే... ఎంగిలి మెతుకులు విసిరినట్టు రూ. 16 వేల కోట్లు ఇచ్చారని మండిపడ్డారు.