Chidambaram: చిదంబరానికి జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు.. ఇంటి భోజనంకు మాత్రం అనుమతి!

  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన చిదంబరం
  • ఈ నెల 17 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
  • ఇంటి భోజనం కావాలన్న చిదంబరం
  • అభ్యంతరం చెప్పని న్యాయస్థానం

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఈ నెల 17 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. చిదంబరం కస్టడీ పొడిగించాలన్న సీబీఐ విజ్ఞప్తికి న్యాయస్థానం ఓకే చెప్పింది. అంతేకాకుండా, తనకు ఇంటి భోజనం కావాలని చిదంబరం న్యాయస్థానానికి విన్నవించుకోగా, దీనిపై జైలు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. చిదంబరంకు ఇంటి భోజనం అనుమతించాలని కోర్టు జైలు అధికారులకు స్పష్టం చేసింది. అటు, బెయిల్ కోసం చిదంబరం సుప్రీంను ఆశ్రయించారు.

దసరాకు ముందే తన పిటిషన్ పై విచారణ జరపాలని చిదంబరం విజ్ఞప్తి చేయగా, వేగవంతమైన విచారణకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాత్రమే నిర్ణయం తీసుకోగలరని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

More Telugu News