Mahesh Babu: చిరంజీవిగారు నట శిఖరం... 'సైరా' చిత్రంపై మహేశ్ బాబు వ్యాఖ్యలు

  • తప్పక చూడాల్సిన సినిమా అంటూ ట్వీట్ చేసిన మహేశ్ బాబు
  • రామ్ చరణ్, సురేందర్ రెడ్డిలకు అభినందనలు
  • రత్నవేలు కెమెరా పనితనాన్ని పొగిడిన మహేశ్ బాబు
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయే చిత్రంగా విశేష స్పందన అందుకుంటున్న 'సైరా' చిత్రంపై అగ్రహీరో మహేశ్ బాబు వ్యాఖ్యానించారు. దృశ్యపరంగా సినిమా రిచ్ గా, అద్భుతంగా ఉందని, చిరంజీవిగారి నటన శిఖరసమానం అని ట్విట్టర్ లో స్పందించారు. 'సైరా' తప్పక చూడాల్సిన సినిమా అని మహేశ్ బాబు పేర్కొన్నారు. నిర్మాతగా వ్యవహరించిన రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు చిత్రయూనిట్ మొత్తానికి శుభాభినందనలు అంటూ ట్వీట్ చేశారు. కళ్లు చెదిరే రీతిలో ఫొటోగ్రఫీ అందించారంటూ కెమెరామన్ రత్నవేలును ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Mahesh Babu
Chiranjeevi
Sye Raa Narasimha Reddy
Ramcharan
Tollywood

More Telugu News