ESI: ‘ఈఎస్ఐ’ కుంభకోణం: ఓమ్మీ మెడి ఉద్యోగి ఇంట్లో రూ.46 కోట్ల విలువైన ఒరిజినల్ పర్చేజ్ ఆర్డర్లు!

  • ఏసీబీ అదుపులో ఉన్న నాగరాజు
  • ఐఎంఎస్ డైరెక్టరేట్‌లో ఉండాల్సిన ఒరిజినల్ పత్రాలు.. నాగరాజు ఇంట్లో
  • కుంభకోణం తీవ్రతకు ఇది నిదర్శనమన్న అధికారులు

ఈఎస్ఐ ఆసుపత్రి మందుల కొనుగోళ్ల వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న సరికొత్త అక్రమాలు అధికారులను విస్తుపోయేలా చేస్తున్నాయి. ఓమ్నీమెడి ఉద్యోగి నాగరాజు ఇంట్లో నిన్న ఏసీబీ నిర్వహించిన సోదాల్లో దొరికిన డాక్యుమెంట్లు మరో అక్రమాన్ని బయటపెట్టాయి. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన నాగరాజు ఇంట్లో నిర్వహించిన సోదాల్లో రూ.46 కోట్ల విలువైన ఒరిజినల్ పర్చేజ్ ఆర్డర్లు, ఇండెంట్లు లభించాయి. ఐఎంఎస్ డైరెక్టరేట్‌లో ఉండాల్సిన నిజపత్రాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయన్న కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా, లభ్యమైన పత్రాలు కుంభకోణం తీవ్రతకు ఉదాహరణ అని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏసీబీ వలలో ఉన్న నాగరాజును అధికారులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.

More Telugu News