Sri Lanka: పాక్‌లో శ్రీలంక జట్టుకు భారీ భద్రత.. ముందు అటు చూడండంటూ గంభీర్ ఎద్దేవా!

  • 42 వాహనాలతో భారీ కాన్వాయ్
  • హోటల్ బయట 2 వేల మందితో భారీ భద్రత
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్

పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టుకు ఆ దేశం కల్పిస్తున్న భద్రతపై టీమిండియా మాజీ ఓపెనర్, ఎంపీ గౌతం గంభీర్ స్పందించాడు. శ్రీలంక జట్టుకు కల్పిస్తున్న భద్రతకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన గంభీర్.. కశ్మీర్ గురించి కాకుండా తొలుత కరాచీ సంగతి చూడాలని ఎద్దేవా చేస్తూ కామెంట్ రాశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై 2009లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఆ దేశంలో క్రికెట్ ఆడేందుకు ఏ దేశమూ ముందుకు రావడం లేదు.

చివరికి మళ్లీ శ్రీలంక జట్టే ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు పాక్‌లో అడుగుపెట్టింది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండో వన్డేలో పాక్ విజయం సాధించింది. నేడు మూడో వన్డే జరగనుంది. ఉగ్ర భయం నేపథ్యంలో పాక్‌లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టుకు అధ్యక్షుడి స్థాయిలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆటగాళ్లు బసచేసే హోటల్‌ బయట,  స్టేడియం చుట్టూ ఏకంగా 2 వేల మంది పోలీసులతో భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక వారు ప్రయాణించే మార్గంలో 42 వాహనాలతో భారీ కాన్వాయ్ ఏర్పాటు చేశారు. ఈ వీడియోను పోస్టు చేసిన గంభీర్.. కశ్మీర్ గురించి మాట్లాడడం ఆపి తొలుత కరాచీ సంగతి చూడాలని ఎద్దేవా చేశాడు.

More Telugu News