Vineeth: మొదటి నుంచీ కూడా నాకు క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం: హీరో వినీత్

  • 1985లో మలయాళ మూవీతో పరిచయం 
  • 'మలయాళంలో 'సర్గమ్' పేరు తెచ్చిందన్న వినీత్ 
  • దానినే క్రాంతికుమార్ గారు 'సరిగమలు'గా రీమేక్ చేశారు

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయకుడిగా వినీత్ కి మంచి పేరు వుంది. క్లాసికల్ డాన్సర్ గా కూడా ఆయన అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. నాట్యానికి సంబంధించిన ప్రత్యేక పాత్రలను అనేక చిత్రాలలో పోషించాడు. అలాంటి వినీత్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నాడు.

"మొదటి నుంచీ కూడా నాకు క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం. అందువలన చాలా ఇష్టంగా నేర్చుకున్నాను. తొలిసారిగా 1985లో ఒక మలయాళ చిత్రంలో నటించాను. ఆ సినిమాలో నేను ఒక చిన్నపాత్రను పోషించాను. అదే సంవత్సరంలో చేసిన ఒక టీనేజ్ లవ్ స్టోరీతో నాకు బ్రేక్ వచ్చింది. ఆ తరువాత డిగ్రీ పూర్తిచేసి, అప్పటి నుంచి నటనపై పూర్తి దృష్టి పెట్టాను. మలయాళంలో నేను చేసిన 'సర్గమ్' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమానే తెలుగులో 'సరిగమలు' పేరుతో క్రాంతికుమార్ గారు రీమేక్ చేశారు. ఈ సినిమాతో తెలుగులోను నాకు మంచి పేరు వచ్చింది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News