ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచిన జగన్ సర్కార్.. హర్షం వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు!
- పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు
- ఉత్తర్వులు జారీ చేసిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి
- ఆర్టీసీ విలీన అధ్యయన కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ నిర్ణయం
మరోవైపు, పదవీ విరమణ వయసును పొడిగించడంపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలిపాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్టీసీలోని 52 వేల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, జనరల్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్ ఈ సందర్భంగా తెలిపారు.