Virat Kohli: కోహ్లీ రికార్డును అధిగమించిన పాకిస్థాన్ బ్యాట్స్ మెన్

  • వన్డేల్లో 70 ఇన్నింగ్స్ లలో 11 సెంచరీలు సాధించిన బాబర్ ఆజం
  • 80 ఇన్నింగ్స్ లలో ఈ ఫీట్ సాధించిన కోహ్లీ
  • 64 ఇన్నింగ్స్ లలోనే ఈ ఘనత సాధించి తొలి స్థానంలో ఉన్న ఆమ్లా

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ బాబర్ ఆజం బద్దలుకొట్టాడు. ప్రస్తుతం శ్రీలంక జట్టు పాకిస్థాన్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. లంకతో జరిగిన రెండో వన్డేలో బాబర్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో తన వన్డే కెరీర్ లో 11వ శతకాన్ని నమోదు చేశాడు. ఈ ఫీట్ అందుకోవడానికి కోహ్లీకి 82 ఇన్నింగ్స్ పట్టగా... బాబర్ కేవలం 70 ఇన్నింగ్స్ లలోనే ఈ ఘనతను సాధించాడు. 64 ఇన్నింగ్స్ లలోనే 11 సెంచరీలు సాధించిన దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండగా... మరో సౌతాఫ్రికా ప్లేయర్ డీకాక్ రెండో స్థానంలో (65 ఇన్నింగ్స్) కొనసాగుతున్నాడు. బాబర్ మూడో స్థానానికి చేరుకోవడంతో... కోహ్లీ నాలుగో స్థానానికి పడిపోయాడు.

More Telugu News