ఓ తండ్రికి కొడుకు ఇచ్చే గొప్ప కానుక ఇదే: 'సైరా'పై అల్లు అర్జున్

Mon, Sep 30, 2019, 03:54 PM
  • అక్టోబరు 2న సైరా రిలీజ్
  • తెలుగు రాష్ట్రాల్లో సైరా హడావుడి
  • ఇన్ స్టాగ్రామ్ లో స్పందించిన బన్నీ
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సైరా మేనియా నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటించిన ఈ చారిత్రక చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మెగా చిత్రంపై అల్లు అర్జున్ స్పందించారు. చిరంజీవి కూడా మగధీర వంటి భారీ చిత్రంలో నటించాలని భావించానని, ఇప్పటికి ఆ కోరిక తీరిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

"ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా చిత్రం. నా బావ రామ్ చరణ్ కు అభినందనలు తెలుపుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవితో ఇలాంటి గొప్ప చిత్రం నిర్మించాడు. ఈ సినిమా చూసిన తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డిపై గౌరవం రెట్టింపైంది. చిత్రయూనిట్ కు నా శుభాకాంక్షలు" అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. చిరంజీవి, నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, కిచ్చ సుదీప్, సేతుపతి వంటి హేమాహేమీలు నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha