హౌడీ-మోదీ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్: ప్రధాని మోదీ
- ముగిసిన మోదీ అమెరికా పర్యటన
- అమెరికా నుంచి భారత్ తిరిగొచ్చిన మోదీ
- ఢిల్లీలో ఘనస్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు
2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఓసారి ఐక్యరాజ్యసమితికి వెళ్లానని, ఇప్పుడు మరోసారి వెళ్లానని, ఈ ఐదేళ్లలో పెద్దమార్పు చూశానని మోదీ వివరించారు. అమెరికాలో నిర్వహించిన హౌడీ-మోదీ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. హూస్టన్ లో భారతీయులు ప్రదర్శించిన స్ఫూర్తి మరువలేనిదని కొనియాడారు. దసరా నవరాత్రుల సందర్భంగా దేశప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.