బోటును వెలికితీసే పనులు కాకినాడకు చెందిన ధర్మాడి సత్యానికి అప్పగింత
- సెప్టెంబరు 15న బోటు ప్రమాదం
- గోదావరిలో మునిగిపోయిన బోటు
- పెద్ద సంఖ్యలో మరణాలు
- ఇప్పటికీ కొందరి ఆచూకీ దొరకని వైనం
అయితే, తమపై విమర్శలు తీవ్రమవుతున్న నేపథ్యంలో బోటును ప్రయివేటు వ్యక్తులతోనే వెలికితీయించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం అనే వ్యక్తికి చెందిన బాలాజీ మెరైన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. రేపటినుంచే బోటు వెలికితీత పనులు మొదలుకానున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రూ.22.70 లక్షలకు వర్క్ ఆర్డర్ జారీ చేశారు.