శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి పెద్దశేష వాహనం సేవలో పాల్గొననున్న సీఎం జగన్
- సోమవారం చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు
- మంగళవారం విజయవాడ రాక
తిరుమలలో వకుళాదేవి వసతిగృహానికి శంకుస్థాపన చేసి, అదే రోజు రాత్రి 7 గంటలకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి 8 గంటలకు నిర్వహించే పెద్దశేష వాహనం సేవలో కూడా సీఎం పాల్గొంటారు. సోమవారం రాత్రికి పద్మావతి గెస్ట్ హౌస్ లో బస చేయనున్న జగన్, మంగళవారం ఉదయం 9 గంటలకు రేణిగుంట నుంచి విజయవాడ తిరిగి వెళతారు.