పాన్ తో ఆధార్ అనుసంధానం... మరో మూడు నెలలు గడువు పొడిగింపు
- సెప్టెంబరు 30తో ముగియనున్న పాత గడువు
- మరికాస్త గడువు పెంచాలని నిర్ణయించిన కేంద్రం
- ఉత్తర్వులు జారీచేసిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం
ఇప్పుడా గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరో మూడు నెలలు గడువు పెంచుతూ తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా విధించిన గడువు ప్రకారం వినియోగదారులు తమ పాన్ కార్డులను డిసెంబరు 31 లోపు ఆధార్ తో అనుసంధానించుకోవాలి.