Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో ఉగ్ర అలజడి... త్రుటిలో ప్రమాదం తప్పించుకున్న ఆర్మీ జవాన్లు

  • పౌరవాహనంపై దాడికి యత్నించిన ఉగ్రవాదులు
  • ఆర్మీ కాన్వాయ్ పై గ్రెనేడ్ దాడి
  • ఓ ఉగ్రవాదిని కాల్చి చంపిన భద్రతా బలగాలు

పుల్వామా దాడి ఘటన తర్వాత మరోసారి జమ్మూకశ్మీర్ లో ఉగ్ర కలకలం రేగింది. ఇద్దరు ఉగ్రవాదులు మూడు చోట్ల దాడులకు పాల్పడగా, భారత సైన్యం దీటుగా స్పందించి వారిలో ఒకరిని మట్టుబెట్టింది. మొదట, ఉగ్రవాదులు ఓ పౌర వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా, వాహనంలో ఉన్న వ్యక్తి వాహనం ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఘటనపై భద్రతా బలగాలకు సమాచారం అందించాడు.

అనంతరం  శ్రీనగర్ లో ఆర్మీ కాన్వాయ్ పై ఆ ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడి నుంచి ఆర్మీ జవాన్లు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ సందర్భంగా జమ్మూ-కిస్త్వార్ జాతీయ రహదారిపై ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇక, గాందర్ బల్ ప్రాంతంలో ఆ ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మరోసారి తారసపడడంతో తుపాకులు గర్జించాయి. ఓ ఉగ్రవాదిని జవాన్లు హతమార్చి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఉగ్రవాది కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

More Telugu News