నెల రోజుల్లో పదవికి రాజీనామా చేయండి.. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యకు ప్రభుత్వం నోటీసులు
- 2019, ఏప్రిల్ 24తో ముగిసిన వర్ల పదవీకాలం
- ఇంకా ఆ పదవిలో కొనసాగడాన్ని ప్రశ్నించిన ప్రభుత్వం
- ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ పార్ధసారథికి కూడా నోటీసులు
ఈ మేరకు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు నిన్న నోటీసు జారీ చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ 1950 చట్టం సెక్షన్-8 లోని ఉపనిబంధన-2 ప్రకారం నెల రోజుల గడువు ఇచ్చారు. వర్ల రామయ్యతో పాటు ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ పార్ధసారథిని కూడా తన పదవికి రాజీనామా చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. కాగా, కడప జోనల్ చైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి రాజీనామాను ఆమోదించింది.