Chiranjeevi: 152వ సినిమాకు హీరోయిన్ ను ఖరారు చేసిన చిరంజీవి!

  • చిరు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం
  • హీరోయిన్ గా ప్రచారంలోకి వచ్చిన పలువురి పేర్లు 
  • చివరకు త్రిషను ఫైనలైజ్ చేసిన చిరంజీవి

టాలీవుడ్, కోలీవుడ్ లో కొన్నేళ్లపాటు అగ్రనాయికగా కొనసాగిన త్రిష... ఓ వెలుగు వెలిగింది. టాప్ హీరోలందరి సరసన ఎన్నో సినిమాలు చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో ఆమె కొంత వెనుకబడిపోయింది. తమిళంలో బిజీగానే ఉన్నప్పటికీ... తెలుగు సినిమాలకు మాత్రం దూరంగా ఉంది. ఈ తరుణంలో, త్రిష బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ సంపాదించింది.
అక్టోబర్ 2న చిరంజీవి 151వ చిత్రం 'సైరా' విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఆ తర్వత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 152వ చిత్రం తెరకెక్కనుంది. గత కొన్నాళ్లుగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార, అనుష్క, ఐశ్వర్యరాయ్, శృతిహాసన్ ల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ... చివరకు త్రిషను చిరంజీవి ఫైనలైజ్ చేశారట. ఈ వార్తలో ఎంత నిజం ఉందో వేచి చూడాలి.

More Telugu News