బోటు ప్రమాదంలో ప్రయాణికులను రక్షించినవారికి నజరానా ప్రకటించిన ఏపీ సర్కారు
- ఒక్కొక్కరికి రూ.25 వేలు నజరానా
- ఇంకా 14 మంది ఆచూకీ తెలియాలన్న మంత్రి కన్నబాబు
- ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడి
బోటు ప్రమాదంలో గల్లంతైన 14 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని, బోటును గోదావరి గర్భం నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నామని కన్నబాబు చెప్పారు. ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా చర్యలు చేపట్టామని వివరించారు. కచ్చులూరు బోటు మునక వ్యవహారంలో ఉన్నతస్థాయి కమిటీతో పాటు మెజిస్టీరియల్ విచారణ కూడా జరుగుతోందని అన్నారు. బోటును బయటికి తీస్తామని కొందరు ప్రయివేటు వ్యక్తులు కూడా వస్తున్నారని, కానీ వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో తమ నిర్ణయం మరో ప్రమాదానికి కారణం కాకూడదన్న ఉద్దేశంతో ఎవరికీ అనుమతివ్వలేదని స్పష్టం చేశారు.