Telugudesam: టీడీపీ నుంచి వచ్చినవాళ్లు బీజేపీ భావజాలంతోనే పనిచేయాలి: జీవీఎల్

  • కేసుల నుంచి తప్పించుకుందామని బీజేపీలో చేరొద్దు
  • బీజేపీలో చేరినంత మాత్రాన కేసులు మాఫీ కావు
  • అవినీతికి మా పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమే
టీడీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన వాళ్లు బీజేపీ భావజాలంతోనే పనిచేయాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమపై ఉన్న కేసుల నుంచి తప్పించుకుందామని బీజేపీలో చేరితే అంతకన్నా పొరపాటు మరోటి ఉండదని, అవినీతికి తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమని స్పష్టం చేశారు. బీజేపీలో చేరినంత మాత్రాన వారిపై కేసులు మాఫీ కావని, వారిపై ఉన్న కేసులకు వారే సమాధానం చెప్పుకోవాలని అన్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీల కేసులు ఏవీ మాఫీ కావని తెలిపారు.
Telugudesam
BJP
Mp
GVL
Narasimharao

More Telugu News