Comedina: వేణుమాధవ్ నా సోదర సమానుడు..నన్ను చెల్లెలిలా చూసుకునేవాడు: యాంకర్ ఉదయభాను

  • వేణు అందరినీ నవ్విస్తూ ఉండేవాడు
  • ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చాలా సార్లు చెప్పా
  • వేణు అన్న లేకపోవడం సినీ ఇండస్ట్రీకి పెద్దనష్టం
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ భౌతికకాయానికి సినీ ప్రముఖులు పలువురు నివాళులర్పించారు. వేణుమాధవ్ కు నివాళులర్పించిన ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను కన్నీరుమున్నీరైంది. వేణు తనకు సోదర సమానుడని, తనను చెల్లెలిలా చూసుకునేవాడని అన్నారు.

ఈ సందర్భంగా తామిద్దరం కలిసి టీవీ షోలలో నటించిన విషయాన్ని గుర్తుచేసుకుంది. వేణు మాధవ్ చాలా హుషారుగా, అందరినీ నవ్విస్తూ ఉండేవాడని గుర్తుచేసుకున్నారు. ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే చలించే మనిషి అని కొనియాడారు. ‘ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని వేణుమాధవ్ కు చాలా సార్లు చెప్పానని, అయినా, ఇలా జరిగిందని వెక్కివెక్కి ఏడ్చింది. ‘వేణు లేరన్న మాట మా కుటుంబానికి తీరని లోటు. వేణు అన్న లేకపోవడం సినీ ఇండస్ట్రీకి పెద్దనష్టం’ అని కన్నీటి పర్యంతమైంది.
Comedina
Venumadhav
Anchor
Udayabhanu

More Telugu News