Roja: మొట్టమొదటి ప్రాజెక్టుకు భూమి పూజ చేయడం సంతోషంగా ఉంది: రోజా

  • ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా రోజా
  • తిరుపతిలో యూనిట్ల ఏర్పాటుకు టీసీఎల్ సన్నద్ధం
  • రూ.2,200 కోట్ల పెట్టుబడి పెడుతున్న ఎలక్ట్రానిక్స్ సంస్థ
ఏపీఐఐసీ చైర్ పర్సన్ హోదాలో రోజా తొలిసారిగా భూమి పూజ నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోజాకు ఎంతో కీలకమైన ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవి దక్కింది. ఈ నేపథ్యంలో, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ టీసీఎల్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా, తిరుపతిలో భూములు కేటాయించారు. దాదాపు రూ.2,200 కోట్లతో తిరుపతిలో టీసీఎల్ రెండు కంపెనీలు ఏర్పాటు చేయనుందని రోజా ఫేస్ బుక్ లో వెల్లడించారు. జగనన్న ఆశీస్సులతో ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించాక మొట్ట మొదటి భూమి పూజ నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు.
Roja
Andhra Pradesh
APIIC
TCL
YSRCP
Jagan

More Telugu News