PVNR Express Way: పిల్లర్ నంబర్ 20 వద్ద డ్యామేజ్.. చర్యలు తీసుకోండి: కేటీఆర్ కు కోన వెంకట్ ట్వీట్

  • పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వేకు డ్యామేజ్
  • ఫొటోలను షేర్ చేసిన కోన వెంకట్
  • ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని విన్నపం
సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ కు సామాజిక బాధ్యత ఎక్కువనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఎన్నో అంశాలపై బాధ్యత గల పౌరుడిగా ఆయన స్పందించారు. తాజాగా ఓ ప్రమాదకర అంశాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 20 వద్ద డ్యామేజ్ అయింది. ప్రమాదకరంగా మారిన ఈ విషయాన్ని కేటీఆర్, జీహెచ్ఎంసీ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకముందే చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు. దీనికి సంబంధించి ఫొటోలను షేర్ చేశారు.
PVNR Express Way
Hyderabad
Damage
Kona Venkat
KTR
GHMC
Tollywood

More Telugu News