Crime News: ఏడాదిన్నర క్రితం ట్రిపుల్ తలాక్‌.. ఇటీవల ఆమెపై అత్యాచారం.. ఓ ప్రొఫెసర్‌ నిర్వాకమిది!

  • అలీగఢ్‌ లోని యూనివర్సిటీలో ప్రొఫెసర్ 
  • వేరుగా ఉంటున్న భార్య 
  • పిల్లల్ని చూసే నెపంతో వెళ్లి అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌ లోని అలీగఢ్‌లోని ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి నిర్వాకమిది. ఏడాదిన్నర క్రితం భార్యకు వాట్సాప్‌ మెసేజ్‌లో సత్వర ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా విడాకులు చెప్పేశాడు. ఆ సందర్భంగా భార్య తనకు ఇది ఇష్టం లేదని, తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని నెత్తీనోరు బాదుకున్నా అతను పట్టించుకోలేదు.

దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకుని వేరుగా ఉంటోంది. విడాకుల అనంతరం పిల్లలను చూసే నెపంతో ఆమె ఇంటికి నిందితుడు తరచూ వస్తుండేవాడు. గత నెల 29వ తేదీన కూడా అలాగే వచ్చాడు. ఆ సమయానికి ఇంట్లో మాజీ భార్య ఒక్కతే ఉండడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు లైంగిక దాడి (సెక్షన్‌ 376), క్రిమినల్‌ బెదిరింపులు (సెక్షన్‌ 506) కింద కేసు నమోదు చేశారు.
Crime News
Uttar Pradesh
alighad
rape on wife
profesor

More Telugu News